![]() |
![]() |

జబర్దస్త్ ద్వారా తక్కువ టైములో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ ఇమ్మానుయేల్. తన పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించడమే కాదు ... వర్షతో నడిపే లవ్ ట్రాక్‌తో మస్త్ ఫేమ్ కూడా సంపాయించాడు.
ప్రస్తుతం ఇమ్మానుయేల్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జాతి రత్నాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇపుడు రీసెంట్ గా కాస్ట్లీ కార్ కొన్నాడు ఈ కమెడియన్. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో ‘జబర్దస్త్’ లేడీ కమెడియన్ రోహిణి కూడా ఉంది. ‘‘మొత్తానికి నేను కన్న కల నిజమైంది. నా లైఫ్‌లో అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. ఈ మధుర క్షణాలను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రేమకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు’’ అని టాగ్ లైన్ పెట్టి కార్ తో దిగిన ఫొటోస్ పోస్ట్ చేశాడు.
ఇక నెటిజనులు ఇమ్మూకి కంగ్రాట్స్ చెబుతున్నారు. 2017లో ‘పటాస్’ ప్రోగ్రామ్ ద్వారా మొదటిసారి బుల్లితెర మీద కనిపించాడు. తర్వాత జబర్దస్త్ షోలో అవకాశం వచ్చింది. అలా 2019లో ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మానుయేల్ ప్రారంభంలో వెంకీ మంకీస్ టీమ్‌లో చేశాడు. తరవాత కెవ్వు కార్తీక్.. బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో కూడా చేశాడు. మొత్తానికి ‘జబర్దస్త్’లో అన్ని టీమ్‌లలో చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్ కొన్న విషయం తెలుసుకుని గెటప్ శీను "కంగ్రాట్స్ రా ఇమ్ము" అని మెసేజ్ చేసాడు. జ్యోతక్క కూడా విషెస్ చెప్పేసింది.
![]() |
![]() |